![]() |
![]() |

పెళ్ళికి ముందు లైఫ్ ఒకలా ఉంటుంది. పెళ్ళి తర్వాత మరొకలా ఉంటుంది. తేడా ఏంటంటో.. పెళ్ళికి ముందున్న హ్యాపీ లైఫ్.. పెళ్ళి తర్వాత ఉండాలంటే ఏం చేయాలో చెప్తుంది కస్తూరి. నటి కస్తూరి.. పరిచయం అక్కర్లేని పేరు. 90 వ దశకంలో తెలుగులో అగ్రహీరోల సరసన నటించి ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకుంది. చెన్నైకి చెందిన కస్తూరి మిస్ మద్రాస్ టైటిల్ ని గెలుచుకుంది.
కస్తూరి తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. అందులో భారతీయుడు సినిమాలో పచ్చని చిలుకలు తోడుంటే పాటలో మెప్పించింది. అన్నమయ్య సినిమాలోని.. ఏలే ఏలే మరదలా పాటలో అందంతో ఆకట్టుకుంది. ఇలా చాలా సినిమాల్లో మంచి హిట్ సాంగ్స్ లో చేసింది. ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన కస్తూరి.. ఇప్పుడు తల్లి పాత్రలో చేస్తూ తెలుగుప్రేక్షకులకి దగ్గరైంది. స్టార్ మా ఛానెల్ లో 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ లో కస్తూరి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రలో చక్కని అభినయం ప్రదర్శిస్తూ ప్రతీ ఇంట్లో గృహిణికి కనెక్ట్ అవుతుంది. బుల్లితెరపై సీరియల్స్ లో బిజీగా ఉన్న కస్తూరి.. ఇటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో ఏదైన ఇష్యూ మీద చర్చ జరుగుతున్నప్పుడు తనకి తోచింది తను చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో ఎవరైన స్త్రీల మీద వివక్ష చూపిస్తే వారిని ఎదురించడానికి ముందు వరుసలో ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడీయోని షేర్ చేసింది కస్తూరి. ఇందులో ఒక మీడియా రిపోర్టర్ ప్రతీ జంట దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతుంటాడు. ఎక్కువ కాలం భార్యభర్తలు హ్యఫీగా ఉండాలంటే మీ సలహాలు చెప్పండని కొంతమందిని అడుగగా.. అందులో చాలామంది భార్య చెప్పిన మాట వింటే చాలు హ్యాపీగా ఉండొచ్చని అన్నారు. ఇదే విషయాన్ని కస్తూరి చెప్తూ.. "హ్యఫీ వైఫ్.. హ్యాపీ లైఫ్.. పెళ్ళాం చెప్పిన మాట వినండి" అని టైటిల్ పెట్టి తన అభిప్రాయాన్ని షేర్ చేసింది.
![]() |
![]() |